
జనరల్

బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల దోపిడీ కేసులో మేడ్చల్-మల్కాజిగిరి పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మాజీ ఆర్మీ అధికారితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుధాల చోరీకి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితుల నుంచి చోరీకి గురైన ఆయుధాలతో పాటు బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు ఎలా చోరీకి గురయ్యాయి? ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!