

సాధారణంగా కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలను యాపిల్ తగ్గిస్తుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా, ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల అనంతరం భారత్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17ఇ, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 16 ధరలను పెంచింది. ఐఫోన్ 17 (256GB) ధర రూ.82,900 నుంచి రూ.99,900కు పెరగగా.. 512GB వేరియంట్ రూ.1,02,900 నుంచి రూ.1,24,900కు చేరింది. ఇక ఐఫోన్ ఎయిర్ 256GB ధర రూ.1,19,900 నుంచి రూ.1,49,900కు, 512GB ధర రూ.1,39,900 నుంచి రూ.1,74,900కు పెరిగింది. 1TB వేరియంట్ రూ.1,59,900 నుంచి రూ.2,24,900కు చేరింది.
ఐఫోన్ 17ఇ 256GB ధర రూ.64,900 నుంచి రూ.79,900కు, 512GB ధర రూ.84,900 నుంచి రూ.1,04,900కు పెరిగింది. ఐఫోన్ 16 (128GB) ధర రూ.69,900 నుంచి రూ.89,900కు చేరింది. మెమొరీ చిప్స్‌తో పాటు కీలక విడిభాగాల ధరలు పెరగడం ఈ ధరల పెంపునకు కారణమని భావిస్తున్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు చిప్‌సెట్లు, మెమొరీకి పెరుగుతున్న డిమాండ్ కూడా ధరలపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్‌లు ఈ నెల 12న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుండగా.. 18వ తేదీ నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి. ఐఫోన్ డ్యూయో ప్రీ-బుకింగ్‌లు అక్టోబర్ 16న, డెలివరీలు అక్టోబర్ 23 నుంచి ఉం


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!