

ఎర్రకోట పేలుడు కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఉమర్ ఉన్ నబీ తొలుత చాందినీ చౌక్‌లోని లాల్ మందిర్ సమీపంలో కారును పార్క్ చేసి అక్కడే పేలుడు జరపాలని భావించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. నవంబర్ 10న సాయంత్రం సుమారు 6.37 గంటలకు లాల్ మందిర్ సమీపంలో కారును నిలిపేందుకు ఉమర్ ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే భారీ ట్రాఫిక్‌తో పాటు పోలీసుల ఉనికి కారణంగా అక్కడ కారును ఆపలేకపోయాడని, దీంతో యూ-టర్న్ తీసుకుని ఎర్రకోట వైపు వెళ్లినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అనంతరం ఎర్రకోట వద్ద కారు బాంబు పేలడంతో 11 మంది మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు.
పేలుడు ఘటనకు ముందు ఉమర్ నూహ్‌లోని ఓ అద్దె గదిలో సుమారు 11 రోజుల పాటు నివసించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. అక్కడ పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు పేర్కొంది. 2023 నుంచి 2025 మధ్య ఉమర్ ఎర్రకోటను 12 సార్లు సందర్శించినట్లు దర్యాప్తులో వెల్లడైందని, చివరిసారిగా 2025 మే 1న అక్కడికి వెళ్లినట్లు తెలిపింది. దీంతో ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించి ఉండొచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. మరో అనుమానితుడు షాహీన్ సయీద్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో లభించిన ఆధారాల్లో యూరియా నైట్రేట్‌ను ఉపయోగించి పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సమాచారం ఉన్నట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!