10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

Writer: Pooja 09:34 PM, 10 సెప్టెంబర్, 2026
ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘వినియోగదారుల పరిరక్షణ (ఈ కామర్స్ సవరణ) నిబంధనలు, 2026’ను ప్రకటించింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం డిస్కౌంట్‌ ధరలను ప్రకటించే సమయంలో గత 30 రోజుల్లో విక్రయించిన అత్యల్ప ధరను అసలు ధరగా చూపించాలి. అలాగే సెర్చ్‌ ఫలితాలను కావాలనే మార్చడం లేదా ర్యాంకింగ్‌ను ప్రభావితం చేయడం నిషేధం. చెల్లింపు ఆధారంగా చూపించే ఉత్పత్తులను ‘స్పాన్సర్డ్‌’గా స్పష్టంగా పేర్కొనాలి.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే డిజిటల్‌ ట్రిక్స్‌ అయిన ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’పై కూడా నిబంధనలు కఠినతరం చేశారు. ఈ కామర్స్‌ సంస్థలు ప్రతి సంవత్సరం స్వీయ తనిఖీ నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని తమ వేదికపై ప్రదర్శించాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విషయంలో ఉత్పత్తి తయారైన దేశం, దిగుమతిదారుడి వివరాలను స్పష్టంగా చూపించాలి. దీంతో వినియోగదారులు ఉత్పత్తి మూలం, విక్రేత వివరాలను కొనుగోలుకు ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు వినియోగదారులకు ఉత్పత్తి గురించి పూర్తి సమాచారం అందించడం కూడా తప్పనిసరి చేశారు. ఉత్పత్తి గడువు, ఉపయోగించాల్సిన తేదీ, రిటర్న్‌, రీఫండ్‌ విధానాలు, వారంటీ, డెలివరీ, చెల్లింపు వివరాలను స్పష్టంగా అందించాలి. వినియోగదారుల అనుమతి లేకుండా అదనపు లేదా సంబంధం లేని సేవల రుసుములను కొనుగోలుకు జత చేయడాన్ని నిషేధించారు. ముందుగానే ఎంపిక చేసి ఉంచే చెక్‌బాక్స్‌ల ద్వారా అదనపు సేవలను వినియోగదారులపై బలవంతంగా రుద్దకూడదు.

అలాగే వినియోగదారుల సమాచారాన్ని వారి అనుమతి లేకుండా ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి ఈ కామర్స్‌ సంస్థ జాతీయ వినియోగదారుల సహాయవాణి నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కావడం తప్పనిసరి చేశారు. మొత్తంగా డిస్కౌంట్‌ ధరలు, సెర్చ్‌ ఫలితాలు, స్పాన్సర్డ్‌ ఉత్పత్తులు, డార్క్‌ ప్యాటర్న్స్‌, దిగుమతి వివరాలు, ఉత్పత్తి సమాచారం, అదనపు రుసుముల విషయంలో కొత్త నిబంధనలు వినియోగదారులకు మరింత రక్షణ కల్పించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

కాగ్నిజెంట్‌ వలస దరఖాస్తులకు బ్రేక్‌

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

ట్యాగ్లు
ఈ కామర్స్వినియోగదారుల రక్షణఆన్‌లైన్ షాపింగ్కేంద్ర ప్రభుత్వండార్క్ ప్యాటర్న్స్జాతీయ వినియోగదారుల సహాయవాణి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్
సినిమాలు

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం
జనరల్

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!