

దేశంలో పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు మెట్రో, బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరారు. ఇంధన పొదుపు ద్వారా దేశంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని స్పష్టం చేసింది. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. అయితే ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్వరలో ఇంధన ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!