
జనరల్

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,52,890కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,40,150గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2.55 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరలు ఒకేసారి తగ్గడంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మార్కెట్‌లో తదుపరి ధరల కదలికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!