

విప్రోలో ఉద్యోగాలకు ఎంపికైన 200 మందికి పైగా ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థులకు స్పష్టత కల్పించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.
విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) జారీ అయ్యాయి. 2026 మార్చిలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా విధుల్లో చేరే తేదీని కేటాయించలేదని నైట్స్ పేర్కొంది. కంపెనీ హెచ్‌ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో అభ్యర్థులు ఆర్థిక, కెరీర్ పరమైన ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. బాధితుల ఆన్‌బోర్డింగ్‌కు సమయపరిమితితో కూడిన ప్రణాళిక ప్రకటించాలని, ఆఫర్ లెటర్లు, ఎల్‌ఓఐల చెల్లుబాటుపై స్పష్టత ఇవ్వాలని, ఎంపికను రద్దు చేస్తే రాతపూర్వకంగా తెలియజేయాలని నైట్స్ డిమాండ్ చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!