

పండుగ సీజన్‌లో కొత్త ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ విక్రయాల్లో ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లపై ధర తగ్గింపులు, బ్యాంకు నగదు వాపసు, పాత ఫోన్ మార్పిడిపై అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 17 (256 జీబీ) ధరను రూ.79,899గా నిర్ణయించగా, రూ.3,000 బ్యాంకు నగదు వాపసు, రూ.8,000 వరకు పాత ఫోన్ మార్పిడి అదనపు ప్రయోజనం కలిపితే దాని తుది ధర రూ.68,899కు చేరుతుంది. ఈ విక్రయాలు అక్టోబర్ 9 ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఐఫోన్ 15 (128 జీబీ) తుది ధర రూ.55,399 కాగా, ఐఫోన్ 16 (128 జీబీ) రూ.65,399కు లభించనుంది. ప్రో మోడళ్లపైనా ధర తగ్గింపులు, పాత ఫోన్ మార్పిడి ప్రయోజనాలను సంస్థ ప్రకటించింది. అయితే ప్రకటించిన తుది ధరలు గరిష్ఠ మార్పిడి విలువ, అదనపు ప్రయోజనం, నగదు వాపసుపై ఆధారపడి ఉంటాయి. పాత ఫోన్ మోడల్, దాని స్థితిని బట్టి మార్పిడి విలువ మారే అవకాశం ఉంది. అలాగే బ్యాంకు ఆఫర్లకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీకు లభించే వాస్తవ తగ్గింపు ఎంతనేది పరిశీలించడం మంచిది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!