

యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టంలోని పారదర్శకత నిబంధనలకు అనుగుణంగా ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్‌జీపీటీ, కోడెక్స్ ద్వారా రూపొందించే టెక్స్ట్‌కు కనిపించని వాటర్‌మార్క్‌లను జోడించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్‌ను రానున్న కొన్ని వారాల్లో అర్హత కలిగిన చాట్‌జీపీటీ, కోడెక్స్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత ఈ సదుపాయం యూరోపియన్ యూనియన్ పరిధిలోనే అమలు కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ఏఐ ఏపీఐని ఉపయోగించే డెవలపర్లు ఎంపిక చేసిన మోడళ్లలో ఈ ఫీచర్‌ను స్వయంగా ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
‘టెక్స్‌ట్‌గ్రెయిన్’గా పిలిచే ఈ టెక్నాలజీ.. ఏఐ రూపొందించే టెక్స్ట్‌లో పదాల ఎంపిక ద్వారా కనిపించని గణాంక సంకేతాన్ని జోడిస్తుంది. అనంతరం ప్రత్యేక డిటెక్టర్ ఆ సంకేతాన్ని గుర్తించి టెక్స్ట్ ఏఐ ద్వారా రూపొందించబడిందా అనే విషయాన్ని అంచనా వేస్తుంది. అయితే ఈ విధానానికి పరిమితులు ఉన్నాయని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. చిన్నదైన లేదా నిర్దిష్ట పరిమితులతో రూపొందించిన టెక్స్ట్‌ను గుర్తించడం కష్టమవుతుందని, ఏఐ టెక్స్ట్‌ను ఎడిట్ చేస్తే వాటర్‌మార్క్ బలహీనపడవచ్చని తెలిపింది. వాటర్‌మార్క్ ద్వారా యూజర్‌ను గుర్తించలేమని, కంటెంట్ యాజమాన్యం, బాధ్యత లేదా ఖచ్చితత్వాన్ని నిర్ధారించలేమని కూడా పేర్కొంది. క్లాడ్ మోడళ్లకు ఆంత్రోపిక్ ఇలాంటి వాటర్‌మార్కింగ్ విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఓపెన్‌ఏఐ తాజా నిర్ణయం తీసుకుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!