

మెటా తన తాజా ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ 'మ్యూస్ ఇమేజ్' (Muse Image)ను అధికారికంగా విడుదల చేసింది. మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ రూపొందించిన ఈ టూల్ ప్రస్తుతం Meta AI యాప్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా చిత్రాలను సృష్టించడం, ఫొటోలను ఏఐతో ఎడిట్ చేయడం, ప్రత్యేక కళాత్మక చిత్రాలను రూపొందించడం వంటి అనేక ఫీచర్లను ఈ టూల్ అందిస్తోంది. ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ ఉత్పత్తులను ఇంట్లో ఎలా కనిపిస్తాయో ఏఐ మాక్‌అప్స్ రూపంలో చూపించే సదుపాయాన్ని కూడా మెటా ప్రదర్శించింది.
అయితే ఈ టూల్‌లోని ఒక ఫీచర్ గోప్యతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఇతరుల పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ట్యాగ్ చేయడం ద్వారా వారి ఫొటోలను ఏఐ రూపొందించిన చిత్రాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించి సంబంధిత వినియోగదారులకు ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదని విమర్శకులు చెబుతున్నారు. వినియోగదారులు ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా ఈ ఫీచర్ నుంచి వైదొలగే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసినప్పటికీ, డిఫాల్ట్‌గా ఈ సదుపాయాన్ని ప్రారంభించడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో మ్యూస్ వీడియో (Muse Video) పేరుతో ఏఐ వీడియో జనరేషన్ టూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మెటా ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!