

ఆపిల్ ఆధ్వర్యంలోని ఇండియా యాప్ స్టోర్ నుంచి ‘బిట్ చాట్’ను తొలగిస్తున్నట్టు ఆ యాప్ రూపకర్త, ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ప్రకటించారు. భారత ప్రభుత్వం చేసిన డిమాండ్ మేరకు ఆ ఆఫ్‌లైన్ మెసేజింగ్ అప్లికేషన్‌ను ఆపిల్ తొలగించిందని పేర్కొన్నారు. బిట్‌చాట్‌లోని కొన్ని అంశాలను భారత్‌లో చట్టవ్యతిరేకమైనవిగా ప్రభుత్వం పరిగణిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఆ యాప్‌ను తొలగించాలని జూలై నెలలోనే కేంద్రప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష పేపర్ల లీకేజీకి నిరసనగా సీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా ఆ ఆదేశాలు ఇచ్చింది. నెట్‌వర్క్‌పై ఆంక్షలు విఽధించినప్పటికీ బిట్‌చాట్ ద్వారా సమాచారం పంపించుకునే సౌకర్యం ఉందని, దానిని తీవ్రవాదులు, సైబర్ నేరగాళ్లు, జాతి వ్యతిరేకశక్తులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున దాన్ని యాప్ స్టోర్ నుంచి తొలగించాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆపిల్ దానిని భారత దేశానికి సంబంధించినంతవరకు తొలగించింది. ఇతర దేశాల్లో మాత్రం అందుబాటులో ఉండనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!