
క్రీడలు

డిజిటల్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్లలో ఒకటైన గూగుల్ సేవల్లో ఈరోజు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. గూగుల్ సెర్చ్ ఉపయోగించేందుకు ప్రయత్నించిన యూజర్లకు “వి ఆర్ సారీ.. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది.. మా ఇంజినీర్లు సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు” అనే సందేశం కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
ముఖ్యంగా భారత్ నుంచి భారీ స్థాయిలో ఫిర్యాదులు నమోదయ్యాయి. “500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్” మెసేజ్ కనిపించిందని, గూగుల్ సెర్చ్ పనిచేయడం లేదని యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. బ్యాక్ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఈ అంతరాయం వచ్చి ఉండవచ్చని నిపుణులు తెలిపారు. కొంతసేపటి తర్వాత సమస్య పరిష్కారం కావడంతో యూజర్లు ఊపిరిపీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!