
రాజకీయాలు

ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా వినియోగదారులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా చోరీకి గురైనట్లు వెల్లడైంది. దుకాణాల్లో చెల్లింపుల కోసం ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినల్స్‌పై మాల్‌వేర్ దాడి జరగడంతో ఈ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ సైబర్ దాడిలో కార్డు నంబర్లు, బ్యాంకింగ్‌కు సంబంధించిన కీలక వివరాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా కార్డు వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, కార్డు లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లో జరిగే లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలని హెచ్చరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!