

డేటా లోకలైజేషన్ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో జనరేట్ అయ్యే డేటాను దేశంలోని సర్వర్ల ద్వారానే ప్రాసెస్ చేయడం ప్రారంభించినట్లు ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ విధానం క్లాడ్ ఏఐ సేవలకు వర్తించనుంది. క్లాడ్ ఓపస్ 5, సోనెట్ 5, హైకూ 4.5 తదితర ఏఐ మోడళ్లను ఉపయోగించే భారతీయ వినియోగదారుల డేటా ప్రాసెసింగ్ ఈ విధానంలో కొనసాగుతుందని సంస్థ తెలిపింది.
దీని ప్రకారం భారత్‌లోని వినియోగదారులు క్లాడ్ ఏఐకి పంపే క్వెరీలను దేశంలోని సర్వర్లలోనే ప్రాసెస్ చేయనున్నారు. కస్టమర్ల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంథ్రోపిక్ ఇండియా ఎండీ ఇరీనా ఘోష్ తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించే క్రమంలో సంస్థ బెంగళూరులో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. దేశీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డేటా నిర్వహణ, ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ఆంథ్రోపిక్ దృష్టి సారిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!