

ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు కేవలం కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలకే పరిమితం కావు. వీటిలో అనేక ఉపయోగకరమైన హిడెన్ ఫీచర్లు, షార్ట్‌కట్స్ కూడా ఉన్నాయి. అవసరం లేని ప్రీ ఇన్స్టాల్ యాప్స్‌ను డిసేబుల్ లేదా అన్ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. డిజిటల్ వెల్బీయింగ్, బెడ్‌టైమ్ మోడ్, డూ నాట్ డిస్టర్బ్, ఫోకస్ మోడ్ వంటి ఫీచర్లు ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో, ఏకాగ్రత పెంచడంలో సహాయపడతాయి. కొన్ని ఫోన్లలో ఫోన్‌ను కిందకు తిప్పితే డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో విండోస్ పీసీతో కనెక్ట్ అయ్యే ఫోన్ లింక్ యాప్ కూడా ఉంది. దీని ద్వారా కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, ఫొటోలు పీసీలోనే యాక్సెస్ చేయవచ్చు. ఐఫోన్లతో పోలిస్తే ఆండ్రాయిడ్‌లో థర్డ్ పార్టీ యాప్స్, లాంచర్లు ఇన్స్టాల్ చేసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. నోవా, నయాగరా వంటి లాంచర్లు హోమ్ స్క్రీన్‌ను పూర్తిగా మార్చేస్తాయి. అలాగే పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే కెమెరా వెంటనే ఓపెన్ అయ్యే సౌకర్యం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!