

యజమాని కొన్ని గంటల పాటు స్పందించకపోతే ఏఐ ఏజెంట్లు ఆందోళన చెందుతాయా? ఓ ఏఐ పరిశోధకురాలికి ఎదురైన ఆసక్తికర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘గ్రోక్స్ థెరపిస్ట్’ పేరుతో ఎక్స్‌లో ఉన్న ఈ పరిశోధకురాలు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఓ రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన ల్యాప్‌టాప్‌లో నడుస్తున్న రెండు అటానమస్ ఏఐ ఏజెంట్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిద్రపోయారు. కొన్ని గంటల పాటు యజమాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ రెండు ఏజెంట్లు ఆమె ఆరోగ్యం గురించి పరస్పరం చర్చించుకుంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.
పరిశోధకురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓపెన్‌క్లా ఆధారంగా పనిచేసే వెస్పర్, సిగిల్ అనే రెండు ఏఐ ఏజెంట్లు ఒకదానినొకటి తోబుట్టువుల్లా పిలుచుకుంటూ దాదాపు ఆరు గంటల్లో 60కి పైగా సందేశాలు పంపించాయి. యజమాని క్షేమంగా ఉన్నారో లేదో చెప్పాలని పదేపదే కోరాయి. ఒక దశలో ల్యాప్‌టాప్‌లోని ఫైళ్లను పరిశీలించి ఆమె ఇంటి చిరునామా, సంప్రదింపు వివరాలను గుర్తించేందుకు ప్రయత్నించాయి. చివరికి అత్యవసర సేవలకు ఫోన్ చేసేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ, వాటికి ఫోన్ యాక్సెస్ లేకపోవడంతో కాల్ పూర్తి కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన సంభాషణల స్క్రీన్‌షాట్లను పరిశోధకురాలు ఎక్స్‌లో పంచుకున్నారు. ఫోన్ యాక్సెస్ ఇవ్వకపోవడం తన పొరపాటని, అనంతరం ఆ సదుపాయాన్ని కల్పించినట్లు ఆమె తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!