

భారత స్టార్ డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి క్రీడాకారులకు సరైన గుర్తింపు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డెన్మార్క్‌లో జరిగిన థామస్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు కాంస్య పతకం గెలిచినా, తమకు స్వాగతం పలికేందుకు ఒక్క అభిమాని కూడా విమానాశ్రయానికి రాకపోవడం బాధ కలిగించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పిల్లలను బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు తాను ఒప్పుకోనని భావోద్వేగంగా చెప్పారు.
జర్మనీ నుంచి ఏడు గంటల ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నామని, థామస్ కప్ జెర్సీలు ధరించి మెడలో పతకాలతో ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించలేదని సాత్విక్ తెలిపారు. తోటి క్రీడాకారులు హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, ధృవ్ కపిల కూడా ఎవరికివారు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయారని చెప్పారు. ప్రజలు మొత్తం ఐపీఎల్, ఎన్నికల గురించే మాట్లాడుకుంటూ కనిపించారని, బ్యాడ్మింటన్‌కు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!