
సినిమాలు

కోనసీమ జిల్లా ఓడలరేవు తీరంలో సముద్రం ఉధృతంగా మారింది. భారీ కెరటాల కారణంగా సముద్రం సుమారు 100 మీటర్ల మేర ముందుకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కెరటాల ధాటికి సముద్ర బీచ్ రిసార్ట్ కట్టడాలు దెబ్బతిన్నాయి. సముద్ర గట్టు తెగిపోవడంతో సముద్రపు నీరు సమీపంలోని చేపల చెరువుల్లోకి చేరుతోంది.
అమావాస్య ప్రభావంతో సముద్రంలో కెరటాల ఉధృతి పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అధికారులు పరిశీలించి, సముద్రపు నీరు మరింత లోనికి రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!