
సినిమాలు

హైదరాబాద్ బాలానగర్‌లో ఈగల్ టీమ్ చేపట్టిన ఆపరేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ములతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీల సమయంలో ఈగల్ టీమ్‌పైకి కుక్కను వదిలి, దానిని అడ్డుగా పెట్టుకుని నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆపరేషన్‌లో దుర్గాప్రసాద్, రవి, కిరణ్‌తో పాటు కమలాకర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల ఇంట్లో సుమారు 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్, నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!