

భారత హాకీ జట్ల జెర్సీ రంగుపై నెలకొన్న చర్చకు తెరపడింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు సంప్రదాయ నీలం రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో హాకీ ఇండియా కాషాయం రంగు జెర్సీని పరిచయం చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. మాజీ కెప్టెన్ వీరెన్ రాస్కిన్హా సహా పలువురు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే సింథటిక్ టర్ఫ్‌తో నీలం రంగు కలిసిపోయే అవకాశం ఉండటంతో ఆటగాళ్లను స్పష్టంగా గుర్తించేందుకు ప్రత్యామ్నాయ రంగును ఎంచుకున్నట్లు హాకీ ఇండియా వివరణ ఇచ్చింది.
ఆసియా క్రీడల నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం జట్టు జెర్సీపై హాకీ ఇండియా అభిప్రాయాన్ని కోరింది. దీనికి స్పందించిన హాకీ ఇండియా కోశాధికారి శేఖర్ మనోహరన్ నీలం రంగును తొలి ఎంపికగా, కాషాయం రంగును రెండో ఎంపికగా సూచించినట్లు తెలిపారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్లు మరోసారి సంప్రదాయ నీలం జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు స్పష్టమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!