

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’ వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ ఇంకా దాదాపు 20 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వరుస ప్రాజెక్టుల షూటింగ్స్‌లో పాల్గొంటున్న కారణంగా ఈ నెల 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు షూటింగ్‌కు విరామం ఉన్నప్పటికీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాల కోసం అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థలు పనిచేస్తున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ ఎపిక్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ‘ఫౌజీ’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!