

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ సైగ రాజకీయ వివాదానికి దారితీసింది. 1975-77 ఎమర్జెన్సీ, మీసా చట్టం కింద జరిగిన అరెస్టులపై మాట్లాడుతున్న సమయంలో విజయ్ తన దవడ వైపు చేతితో సైగ చేశారు. ఈ సైగ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే విజయ్ తన ప్రసంగంలో ఎక్కడా స్టాలిన్ పేరును ప్రస్తావించలేదు.
ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను మీసా చట్టం కింద అరెస్ట్ చేయడం, పోలీసు కస్టడీలో దాడి జరగడంతో ఆయన దవడకు గాయమైందని డీఎంకే వర్గాలు చాలాకాలంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సైగ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డీఎంకేతో పాటు విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న సీపీఎం కూడా ఆయన తీరును తప్పుబట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం విమర్శలు చేశారు. అయితే విజయ్ చేసిన సైగను బాడీ-షేమింగ్‌గా చూడటాన్ని టీవీకే అధికార ప్రతినిధి సత్యకుమార్ ఖండించారు. ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని, అది కేవలం సాధారణ సైగ మాత్రమేనని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!