
షోస్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లోనావాలాలో భారీగా ఆస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం 3.86 ఎకరాల భూమిని సుమారు రూ.70 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4, 2026న మూడు వేర్వేరు డీల్స్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. ఈ ఆస్తిలో ఇప్పటికే నిర్మించిన 2,100 చదరపు అడుగుల నిర్మాణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అతిపెద్ద భూమిపై సచిన్‌కు పూర్తి యాజమాన్య హక్కులు ఉండగా, మిగిలిన రెండు చిన్న ప్లాట్లలో 50 శాతం వాటా పొందినట్లు సమాచారం. ఈ మూడు లావాదేవీలకు సంబంధించి స్టాంప్ డ్యూటీగా రూ.4 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ముంబై, పుణే నగరాలకు సమీపంలో ఉన్న లోనావాలా ప్రముఖ వీకెండ్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఉంది. సెలబ్రిటీలు, సంపన్నులు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు, సెకండ్ హోమ్స్ కొనుగోలు చేయడం సాధారణంగా కనిపిస్తుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!