

ఒంటి చేత్తో బ్యాక్‌హ్యాండ్ షాట్ ఆడటం టెన్నిస్‌లో ఓ ప్రత్యేక కళ. గతంలో జాన్ మెకెన్రో, ఇవాన్ లెండిల్, పీట్ సంప్రాస్, స్టెఫాన్ ఎడ్‌బర్గ్, గుస్టావ్ కుర్టెన్ వంటి దిగ్గజాలు ఈ షాట్‌తో అభిమానులను అలరించారు. ఆ తర్వాత రోజర్ ఫెడరర్, స్టాన్ వావ్రింకా, ప్రస్తుత తరం ఆటగాళ్లు డెనిస్ షపోవలోవ్, స్టెఫానోస్ సిట్సిపాస్ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే ఆధునిక టెన్నిస్‌లో రెండు చేతుల బ్యాక్‌హ్యాండ్ ప్రాధాన్యం పెరగడంతో ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్ క్రమంగా కనుమరుగవుతోంది.
ఈ క్రమంలో యూఎస్ ఓపెన్‌లో సిట్సిపాస్ నిష్క్రమణతో ఓ అరుదైన రికార్డుకు తెరపడింది. ప్రీక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ చేతిలో సిట్సిపాస్ ఓటమిపాలయ్యాడు. దీంతో 1877లో వింబుల్డన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్‌లో కనీసం ఒక ఒంటి చేతి బ్యాక్‌హ్యాండ్ ఆటగాడు సెమీఫైనల్‌కు చేరుతున్న 149 ఏళ్ల పరంపరకు బ్రేక్ పడింది. ఈసారి ఆ జాబితాలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం టెన్నిస్ చరిత్రలో అరుదైన పరిణామంగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!