

వీసా చీటింగ్ కేసులో యూట్యూబర్ రమానందన ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమెను అధికారులు విచారించారు. విదేశాల్లో వీసాతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రమానందన దంపతులు రూ.13 లక్షలు వసూలు చేశారని క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్న రమానందనకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
మరోవైపు, వీసా స్కామ్‌కు సంబంధించి రమానందనపై అద్దంకి పోలీస్ స్టేషన్‌లోనూ మరో కేసు నమోదైంది. వీసా రెన్యువల్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఆగస్టులోనే అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు రావాలని రమానందన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, అద్దంకి ప్రాంతాల నుంచి పలువురు బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!