

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానం బలపర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ముంబయికి ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఆందోళన కలిగిస్తోంది. శనివారం రాయ్‌పూర్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా రెండు జట్ల ప్రాక్టీస్ సెషన్లు అంతరాయం కలిగాయి. ఆదివారం వాతావరణం మెరుగుపడినప్పటికీ సాయంత్రం జల్లులు పడే అవకాశముందని సమాచారం. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 35 సార్లు తలపడగా ముంబయి 19, ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!