

OpenAI తన ChatGPT డెస్క్‌టాప్ అనుభవాన్ని Linuxకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం.. ChatGPT, ChatGPT Work, Codexలను ఒకే డెస్క్‌టాప్ యాప్‌లో అందించే Linux వెర్షన్‌ను ప్రివ్యూ దశలో తీసుకురానుంది. Ubuntu, Debian, Fedora డిస్ట్రిబ్యూషన్లతో పాటు x64, ARM64 ప్రాసెసర్లకు ఈ వెర్షన్ మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం OpenAI అధికారిక సమాచారం ప్రకారం ChatGPT డెస్క్‌టాప్ యాప్‌లో Chat, Work, Codex సమీకరణం Windows, macOSలో అందుబాటులో ఉంది.
Linux వెర్షన్ అందుబాటులోకి వస్తే డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, టెక్నికల్ టీమ్‌లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. సాధారణ ప్రశ్నలకు ChatGPT, సుదీర్ఘమైన బహుళ దశల పనులకు Work, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం Codexను ఒకే వర్క్‌స్పేస్‌లో ఉపయోగించుకోవచ్చు. OpenAI అధికారిక వివరాల ప్రకారం Codex స్థానిక ఫోల్డర్లు, రిపాజిటరీలు, టెర్మినల్స్, డెవలపర్ టూల్స్‌తో పనిచేసేలా రూపొందించబడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!