
జనరల్

సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన ‘కంటి వెలుగు’ పథకాన్ని కొనసాగించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరాల్లో ఆపరేషన్ అవసరమని గుర్తించిన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించే బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ వెల్లడించారు.
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రభుత్వం కూడా గుర్తించి ‘కంటి వెలుగు’ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని కేటీఆర్ అన్నారు. తాము చేపడుతున్న సేవలను చూసైనా ప్రభుత్వానికి ఆలోచన వచ్చి పథకాన్ని పునరుద్ధరించాలని సూచించారు. పేదలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత కంటి వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!