

అమరావతిలో కీలక మౌలిక వసతుల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జిల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను ప్రారంభించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌ను కూడా సీఎం పరిశీలించనున్నారు.
అమరావతికి రాకపోకలను మరింత సులభతరం చేసేలా రెండు స్టీల్ బ్రిడ్జిలను నిర్మించారు. బకింగ్‌హామ్ కెనాల్‌పై 110 మీటర్ల పొడవైన ఒక స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగు, గుంటూరు ఛానల్‌పై 280 మీటర్ల పొడవైన మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి నేరుగా రాకపోకలు సాగించే అవకాశం కలగనుంది. అమరావతికి స్వాగతం పలికేలా స్టీల్ బ్రిడ్జి వద్ద ప్రత్యేక ఆకారంలో పైలాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!