9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ శుభారంభం...

Writer: Chandrika 09:52 AM, 9 అక్టోబర్, 2026
ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ శుభారంభం...

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో డిఫెండింగ్ ఛాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. గురువారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీరాజ్ యోధాస్‌పై 5-3తో విజయం సాధించింది. తొలి సెట్‌ను రాజ్‌పుతానా 75-69తో గెలుచుకోగా, రెండో సెట్‌లో యోధాస్ 74-43తో నెగ్గి స్కోరును సమం చేసింది. మూడో సెట్ 77-77తో టై కావడంతో నాలుగో సెట్ కీలకంగా మారింది. హోరాహోరీగా సాగిన పోరులో రాజ్‌పుతానా రాయల్స్ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో ఉత్కంఠభరిత పోరులో కాకతీయ నైట్స్ 4-4తో సమంగా నిలిచిన అనంతరం షూటాఫ్‌లో 2-0తో మైటీ మరాఠాస్‌ను ఓడించింది. ఒక దశలో 4-0తో ఆధిక్యంలో ఉన్న మరాఠాస్‌కు నిరాశ ఎదురైంది. ధీరజ్ బొమ్మదేవర ఆరంభంలో రాణించినప్పటికీ, అతడి స్థానంలో వచ్చిన మృనాల్ చౌహాన్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో కాకతీయ నైట్స్ పుంజుకుని విజయం సాధించింది.

మరో మ్యాచ్‌లో చేరో ఆర్చర్స్ 5-3తో చోళా చీఫ్స్‌ను ఓడించింది. తొలి సెట్‌ను 74-69తో, మూడో సెట్‌ను 79-75తో చేరో ఆర్చర్స్ గెలుచుకుంది. రెండో సెట్‌ను చోళా చీఫ్స్ 71-70తో కైవసం చేసుకుంది. నాలుగో సెట్ 73-73తో టై కావడంతో చేరో ఆర్చర్స్ విజయం ఖాయమైంది. అంతకుముందు తెలంగాణ క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. తొలి రోజే ఆసక్తికర పోటీలు, ఉత్కంఠభరిత ముగింపులతో లీగ్ అభిమానులను ఆకట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..

ట్యాగ్లు
ఆర్చరీ ప్రీమియర్ లీగ్రాజ్‌పుతానా రాయల్స్పృథ్వీరాజ్ యోధాస్కాకతీయ నైట్స్మైటీ మరాఠాస్చేరో ఆర్చర్స్చోళా చీఫ్స్ధీరజ్ బొమ్మదేవరవాకిటి శ్రీహరిహైదరాబాద్ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు
సినిమాలు

నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ లుక్ విడుదల...రిలీజ్ డేట్ ఖరారు

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు
జనరల్

ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా మోహరింపు

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?
గాసిప్స్

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్
సినిమాలు

డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా - శృతి హాసన్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..
జనరల్

విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో నీటి కష్టాలు..

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..
సినిమాలు

రణబాలి ట్రైలర్ లాంచ్‌కు రష్మిక ఎందుకు రాలేదంటే..

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్
షోస్

వివాదంలో తమిళ బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?
జనరల్

రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో కారణమయ్యేనా?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?
గాసిప్స్

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..
జనరల్

జేడీ వాన్స్ విమర్శలకు మైక్రోసాఫ్ట్ కౌంటర్..

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
జనరల్

మణిపూర్‌లో ఐఈడీలను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!