

న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ దళాన్ని సమర్థంగా నడిపించిన సిరాజ్‌ను తొలి టెస్టులో పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తొలి రోజు కివీస్‌ను 70/5తో కట్టడి చేసిన భారత్.. ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించలేకపోయింది. అన్షుల్ కంబోజ్ కంటే అనుభవజ్ఞుడైన సిరాజ్ జట్టులో ఉంటే బుమ్రాకు మెరుగైన సహకారం లభించేదని సునీల్ గావస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో క్రైస్ట్‌చర్చ్‌లో శుక్రవారం ప్రారంభమయ్యే టెస్టుకు భారత్ ఎలాంటి జట్టు కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాలి.
తొలి టెస్టులో ఆశించిన ప్రభావం చూపని కంబోజ్ స్థానంలో సిరాజ్‌ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రాతో కలిసి సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటే భారత పేస్ దాడి మరింత బలపడనుంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాను ఆడించే అవకాశముండగా, ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. మరోవైపు, తొలి టెస్టులో బ్యాటర్లు రాణించడంతో ఆ విభాగంలో మార్పులు చేసే అవసరం భారత్‌కు కనిపించడం లేదు. వెలింగ్టన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ఐదు రోజుల్లో 24 వికెట్లు మాత్రమే పడ్డాయి. భారీ ఆధిక్యం సాధించినప్పటికీ న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయలేక భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. అయితే క్రైస్ట్‌చర్చ్ పిచ్‌పై పచ్చిక ఉండటంతో పేసర్లకు బౌన్స్, స్వింగ్ లభించే అవకాశముంది. తొలి రోజు వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. ఇక్కడి పిచ్‌పై ఇప్పుడే అంచనాకు రావద్దని న్యూజిలాండ్ పేసర్ హెన్రీ పేర్కొన్నాడు. సాధారణంగా పేసర్లకు సహకారం లభించినా, బ్యాటర్లకూ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని అతడు తెలిపాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!