26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

Writer: Nithish 05:53 AM, 26 నవంబర్, 2026
ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి సంస్థలో దశాబ్దానికి పైగా పనిచేసిన అనంతరం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఆయన నిష్క్రమణకు గల కారణాలను, చివరి పని దినాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం చీఫ్‌ ప్రొడక్ట్‌ అండ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న బాలాజీ త్యాగరాజన్‌ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. బోర్డుతో కలిసి సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. రాబోయే కొన్ని వారాల్లో కొత్త సీఈఓను ప్రకటించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. కృష్ణమూర్తి నాయకత్వంలో సంస్థ వ్యాపారం ఐదు రెట్లకు పైగా వృద్ధి చెందినట్లు వెల్లడించింది.

సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌ స్థాపించిన ఫ్లిప్‌కార్ట్‌లో కృష్ణమూర్తి 2016లో చేరారు. 2017లో సీఈఓగా, 2018లో గ్రూప్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే వాల్‌మార్ట్‌ సుమారు 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అమెజాన్‌, మీషో వంటి సంస్థల నుంచి పోటీని ఎదుర్కొంటూ ఫ్లిప్‌కార్ట్‌ వృద్ధికి ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే సంస్థలో అంతర్గత సమస్యలు, ఐపీఓ ఆలస్యం, మాతృ సంస్థ వాల్‌మార్ట్‌తో విభేదాలు ఆయన నిష్క్రమణకు కారణాలై ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు సీనియర్‌ అధికారులు సంస్థను వీడటం కూడా చర్చనీయాంశమైంది. కృష్ణమూర్తి నాయకత్వానికి, సంస్థకు చేసిన సేవలకు వాల్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ క్రిస్‌ నికోలస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ ప్రయాణంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..

దీపావళి వేళ క్విక్‌ కామర్స్‌ జోరు..

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

ట్యాగ్లు
ఫ్లిప్‌కార్ట్‌కల్యాణ్‌ కృష్ణమూర్తిబాలాజీ త్యాగరాజన్‌ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓవాల్‌మార్ట్‌ఈ-కామర్స్‌ఐపీఓభారతీయ స్టార్టప్‌లుఆన్‌లైన్‌ షాపింగ్‌కార్పొరేట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ
జనరల్

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన
జనరల్

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే
జనరల్

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!