

ఉత్తర్‌ప్రదేశ్‌లో తదుపరి భాజపా ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని మౌర్య స్పష్టం చేశారు. బుధవారం జౌన్‌పుర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ ఎన్నికల్లో కమలం గుర్తునే ప్రధానంగా ముందుకు తీసుకెళ్తుందని, ఏ వ్యక్తి ముఖాన్ని చూపించి ఎన్నికలకు వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని వివరించారు.
మౌర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అందరికీ తెలుసని అన్నారు. తమకు కమలమే ప్రధానమని పేర్కొంటూనే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో, ఎవరు కాదో ప్రజలకు స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలు ఉత్తర్‌ప్రదేశ్ భాజపాలో నాయకత్వంపై చర్చకు దారితీశాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!