26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

Writer: Nithish 05:47 AM, 26 నవంబర్, 2026
తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

కొన్ని గాత్రాలు కేవలం సంగీతాన్నే అందించవని, మన బాల్యం నుంచి జీవితంలోని ముఖ్యమైన సందర్భాల వరకు తోడుగా నిలిచి చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ప్రముఖ గాయని కె.ఎస్‌. చిత్ర అన్నారు. లతా మంగేష్కర్‌, ఆశా భోస్లే, ఎస్‌. జానకి గాత్రాలు అలాంటివేనని పేర్కొన్నారు. గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి)లో భాగంగా బుధవారం నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో ఆమె పాల్గొన్నారు. ‘లతా మంగేష్కర్‌ టాక్‌: ది వాయిసెస్‌ దట్‌ ఎకోస్‌ ఫరెవర్‌ – ఇన్‌ ది మెమొరీ ఆఫ్‌ ఆశా భోస్లే అండ్‌ ఎస్‌. జానకి’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమానికి నటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన బాల్యం, సంగీత ప్రయాణం, తనను ప్రభావితం చేసిన గాయనుల గురించి చిత్ర పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన తాను చిన్నతనం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నానని, పాటల పోటీల్లో పాల్గొన్నానని చిత్ర తెలిపారు. సినిమా సంగీతంలోకి తన ప్రవేశం అనుకోకుండా జరిగిందన్నారు. లతా మంగేష్కర్‌ భక్తి గీతాల్లో భావోద్వేగం అద్భుతంగా ఉంటుందని, ఆశా భోస్లే విభిన్న సంగీత ప్రక్రియల్లో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఎస్‌. జానకి స్వరంలోని వైవిధ్యం, భావ వ్యక్తీకరణ ప్రతి పాటకు ప్రాణం పోసేవని చెప్పారు. చిన్నతనంలో జానకిని అనుకరించేదాన్నని, ఆమెను తన తల్లిలా భావించానని గుర్తుచేసుకున్నారు. ఒకసారి జానకి ఇంటికి వెళ్లినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, స్వయంగా తనకు అన్నం తినిపించారని తెలిపారు. సంగీతం ప్రేమ, వివాహం, దుఃఖం, సంతోషం వంటి జీవితంలోని ప్రతి దశలోనూ తోడుగా ఉంటుందని, మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తపరుస్తుందని సుహాసిని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!
ట్యాగ్లు
కెఎస్‌ చిత్రలతా మంగేష్కర్‌ఆశా భోస్లేఎస్‌ జానకిసుహాసినిఇఫిఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాభారతీయ సంగీతంనేపథ్య గానంసంగీత దిగ్గజాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శర్వా డింపుల్ బాండింగ్.. అసలు కథ ఇదే!

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే
జనరల్

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

నాంపల్లి రైల్వే స్టేషన్  ముఖద్వారం కూల్చివేత
జనరల్

నాంపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం కూల్చివేత