26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

Writer: Harika S 10:23 PM, 25 నవంబర్, 2026
కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సరికొత్త అవతారమెత్తాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20) 2027 సీజన్‌కు ముందు డర్బన్స్ సూపర్ జెయింట్స్ (డీఎస్జీ) హెడ్ కోచ్‌గా విలియమ్సన్ నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఆటగాడిగా బరిలోకి దిగిన అతడు, ఇప్పుడు పూర్తిస్థాయి కోచ్‌గా డీఎస్జీ డగౌట్‌లో అడుగుపెడుతున్నాడు. 2023లో లీగ్ ప్రారంభం నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ లాన్స్ క్లూసెనర్ స్థానాన్ని విలియమ్సన్ భర్తీ చేశాడు.
విలియమ్సన్ నియామకంపై డర్బన్స్ సూపర్ జెయింట్స్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మైదానంలో ఆటగాడిగా సేవలందించిన విలియమ్సన్, ఇప్పుడు తన అపారమైన అంతర్జాతీయ అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యంతో జట్టును ముందుకు నడిపిస్తాడని ఫ్రాంచైజీ తెలిపింది. విలియమ్సన్ ఒక క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 2025, 2026 సీజన్లలో డీఎస్జీ తరఫున ఆడిన అతడు 15 మ్యాచ్ లలో 343 పరుగులు సాధించాడు.


డీఎస్జీలో క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ, బ్యాటింగ్ కోచ్ ర్యాన్ కుక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, స్పిన్ కోచ్ కార్ల్ క్రోలతో కలిసి విలియమ్సన్ పనిచేయనున్నాడు. ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్‌తో అతడికి మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా, 'ది హండ్రెడ్' టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ కోచ్‌గా విలియమ్సన్ పనిచేశాడు.


ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధికంగా 9,515 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడి సారథ్యంలోనే కివీస్ జట్టు 2021లో తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుంది. గత సీజన్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న డీఎస్జీ జట్టు, 2027 జనవరి 19న ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగే పోరుతో తమ ప్రచారాన్ని మొదలుపెట్టనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

ట్యాగ్లు
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్కేన్ విలియమ్సన్టీ20 లీగ్డర్బన్స్ సూపర్ జెయింట్స్ (డీఎస్జీ)హెడ్ కోచ్‌దక్షిణాఫ్రికా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

నాంపల్లి రైల్వే స్టేషన్  ముఖద్వారం కూల్చివేత
జనరల్

నాంపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం కూల్చివేత

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
ఆరోగ్యం

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
జనరల్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!
రాజకీయాలు

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్
క్రీడలు

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!