

మహిళల అండర్-18 ఆసియా కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. పూల్-ఏ చివరి మ్యాచ్‌లో సింగపూర్‌ను 25-0తో చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పటికే సెమీఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకున్న భారత్ ఈ విజయంతో పూల్ దశను ఓటమి లేకుండా ముగించింది. పాయకరావుపేటకు చెందిన మిడ్‌ఫీల్డర్ నమ్మి గీతాశ్రీ ఐదు గోల్స్‌తో మెరిసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. నౌషీన్ ఏడు, స్వీటీ నాలుగు, ప్రియాంక హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయానికి తోడ్పడ్డారు. తొమ్మిది పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచి సెమీస్ ప్రత్యర్థిని ఎదురుచూస్తోంది.
ఇక జపాన్‌లో జరుగుతున్న పురుషుల అండర్-18 ఆసియా కప్‌లో కూడా భారత్ సత్తా చాటుతోంది. పూల్-ఏ చివరి మ్యాచ్‌లో చైనీస్ తైపీపై 13-1తో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళలు, పురుషులు రెండూ అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతూ భారత హాకీ భవిష్యత్తుపై ఆశలు పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!