
సినిమాలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీజీటెట్-2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగేందుకు, అలాగే పదోన్నతులు పొందేందుకు టెట్ అర్హత తప్పనిసరిగా పేర్కొంది. ఈ పరీక్షను 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనుండగా, నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
అర్హత కలిగిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు జులై 22 నుంచి జులై 29 వరకు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు గడువులోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!