
జనరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘పెద్ది’ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌తో కలిసి తన 17వ చిత్రం RC17 చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడగా, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ నేపథ్యంలో RC17లో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మికను ఈ చిత్రంలోని కీలకమైన హీరోయిన్ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!