
జనరల్

83 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆయన, తాజాగా తాను శస్త్రచికిత్స చేయించుకున్నానని, కొన్ని రోజులు ఐసీయూలో చికిత్స పొందిన తర్వాత కోలుకుని ఇంటికి తిరిగి వచ్చానని వెల్లడించారు. అయితే తనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటో మాత్రం వెల్లడించలేదు.
ఇంటికి వచ్చిన తర్వాతే అసలైన పరీక్ష మొదలైందని, శస్త్రచికిత్స తర్వాత కోలుకునే ప్రక్రియ శారీరకంగానే కాక మానసికంగానూ చాలా కష్టంగా ఉందని అమితాబ్ తెలిపారు. జీవితంలో ఎంత విజయవంతులైనా ఒక దశలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాల్లో కనిపించాలని ఆకాంక్షిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!