

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి కుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు ఎంపీల బృందం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం ముడి పొగాకు (HSN 2401)పై అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరింది. ఈ విజ్ఞప్తి కేవలం ముడి పొగాకుకు మాత్రమే సంబంధించినదని, తయారైన పొగాకు ఉత్పత్తులతో దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎఫ్‌సీవీ (FCV) పొగాకు విలువపై అధిక జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపుతోందని మంత్రులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీ తగ్గిస్తే పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరట లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత పెరుగుతుందని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.












కామెంట్స్ (1)
🙌