

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు సాధించిన చారిత్రక విజయానికి కేవలం కఠిన సాధన మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక విలువైన సలహా కూడా కీలకంగా మారిందని ఆమె భర్త వెంకట దత్త సాయి వెల్లడించారు. ఫామ్ కోల్పోయిన సమయంలో శతకం కోసం ఎదురుచూపులను ఎలా అధిగమించావని సింధు అడగగా, ఫలితాల గురించి కాకుండా ఆటలోని ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభించానని కోహ్లీ చెప్పినట్లు ఆయన వివరించారు. అదే ఆలోచనను బ్యాడ్మింటన్‌లో అమలు చేయడంతో సింధు మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని, ఆటపై ఆసక్తిని తిరిగి పొందిందన్నారు.
పారిస్ ఒలింపిక్స్ అనంతరం సింధు ఆటతీరును స్పోర్ట్స్ సైన్స్ ఆధారంగా విశ్లేషించి లోపాలను గుర్తించినట్లు దత్త సాయి తెలిపారు. కాలివేలి గాయం నుంచి కోలుకునేందుకు అమెరికాలోని అట్లాంటాలో ప్రత్యేక పునరావాస శిక్షణ అందించడంతో పాటు, సుమారు 3.5 కిలోల బరువు తగ్గి కఠినమైన ఆహార నియమాలను పాటించిందన్నారు. కోచ్‌లు, ఫిట్నెస్ నిపుణుల సహకారంతో ఆటతీరును మెరుగుపర్చుకున్న సింధు, జపాన్‌కు చెందిన అకానే యమగుచిని వరుస గేమ్‌ల్లో ఓడించి జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని, న్యూఢిల్లీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!