

బిగ్‌బాస్ అభిమానులకు జియోస్టార్ శుభవార్త అందించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కొత్త బిగ్‌బాస్ సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హిందీకి సల్మాన్ ఖాన్, తెలుగుకు నాగార్జున, తమిళానికి విజయ్ సేతుపతి, కన్నడానికి కిచ్చా సుదీప్, మలయాళానికి మోహన్‌లాల్, బెంగాలీకి సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా బిగ్‌బాస్ విజయవంతమైన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ "ఇండియాస్ బిగ్ రియాలిటీ" పేరుతో ప్రత్యేక కాఫీ టేబుల్ బుక్‌ను జియోస్టార్ విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా ఈ రియాలిటీ షో ప్రతి సీజన్‌తో మరింత ప్రజాదరణను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు ప్రారంభం కావడం బిగ్‌బాస్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!