

అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’, మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కి మూడు సంవత్సరాల తర్వాత అఖిల్‌కు మంచి విజయాన్ని అందించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ‘ఏజెంట్’ తర్వాత ఈ విజయం రావడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున చిత్రాల విడుదల తేదీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హాలీవుడ్ చిత్రం ‘ది ఒడిస్సీ’ ఏడాది ముందే విడుదల తేదీ ప్రకటించి అదే తేదీన విడుదలైందని, కానీ తెలుగు చిత్రాలు ప్రకటించిన తేదీలకు విడుదల కావడం లేదని నాగార్జున అన్నారు. ‘లెనిన్’ను కూడా జూన్ 26న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ వంటి చిత్రాల ఫైనల్ కాపీలు నెల రోజుల ముందే సిద్ధంగా ఉండేవని గుర్తుచేసిన ఆయన, విడుదలకు కనీసం రెండు వారాల ముందే అన్ని పనులు పూర్తి చేసి ఫైనల్ కాపీ సిద్ధం చేయాలని దర్శకులు, నిర్మాతలకు సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!