

టీ20ల్లో వరుస ఓటముల తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. జింబాబ్వేపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ అద్భుత అర్ధశతకంతో మెరిసి అంతర్జాతీయంగా తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ వేగంగా 35 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 నాటౌట్‌తో జట్టును విజయానికి నడిపించాడు. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ముందుగా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జింబాబ్వేను 125 పరుగులకు పరిమితం చేశారు. ఇటీవలి విజయాలతో జోరుమీదున్న జింబాబ్వేకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. రెండో ఓవర్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను భారత్ వైపు మలిచాడు. అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా సూర్యవంశీ దూకుడు తగ్గకుండా జట్టుకు సునాయాస విజయం అందించాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!