

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో షావాలీ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా, నలుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మరో నలుగురు డకౌట్‌గా వెనుదిరిగారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 18 పరుగులు, దీప్తి శర్మ 14 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన నిరాశపరిచారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, షెఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీ చరణికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!