

రాజధాని అమరావతిని ఎన్‌హెచ్-16తో అనుసంధానించే తొలి రహదారిగా ఈ-13 ఎక్స్‌టెన్షన్ రోడ్డు నిలవనుంది. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో జాతీయ రహదారిని రాజధానితో కలిపేందుకు రెండు ‘ఈ’ సిరీస్ రోడ్లను ప్రతిపాదించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-3 పనులు ప్రారంభమైతేనే ఎన్‌హెచ్-16తో అనుసంధానం సాధ్యమవుతుంది. అయితే ఈ-13 రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమై గణనీయంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం 10.45 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో నెక్కల్లు, అనంతవరం నుంచి యర్రబాలెం వరకు 7.3 కి.మీ. రహదారిని రూ.208 కోట్లతో నిర్మిస్తున్నారు.
3.43 కి.మీ. పొడవైన ఈ-13 ఎక్స్‌టెన్షన్ రెండో దశ అత్యంత సంక్లిష్టమైన భాగంగా ఉంది. దీని నిర్మాణానికి రూ.400 కోట్లకు పైగా ఖర్చవుతుండగా, కేంద్రం రూ.274 కోట్ల అంచనా వ్యయంతో 609 మీటర్ల పొడవైన ఆర్వోబీని నిర్మిస్తోంది. యర్రబాలెం నుంచి డాన్‌బాస్కో స్కూల్, విజయవాడ-గుంటూరు రైల్వే ట్రాక్, డోలాస్ నగర్ కొండలు, ఎయిమ్స్, డీజీపీ కార్యాలయం మీదుగా ఈ రహదారి ఎన్‌హెచ్-16ను కలుస్తుంది. 60 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా నిర్మించే ఈ రోడ్డులో రెండు కొండలను తొలచే పనులతో పాటు భారీ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంటుంది. ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన 3.34 ఎకరాల ఎయిమ్స్ భూమికి సంబంధించిన సమస్య కూడా గత నెల పరిష్కారమై నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!