

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ లేదా డాక్ సేవక్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు స్థానిక భాషపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లిష్, లెక్కలు సబ్జెక్టులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ జీడీఎస్ నియామకాల అధికారిక వెబ్‌సైట్: https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!