

టీడీపీ శ్రేణుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పార్టీ నాయకత్వం తొలిసారిగా ‘లీడర్‌షిప్ కాంక్లేవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శిక్షణ, పరస్పర సంభాషణ విధానంలో నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనాయకుల్లో నాయకత్వ పటిమను పెంచడం, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం ఈ కాంక్లేవ్ ప్రధాన లక్ష్యం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
కాంక్లేవ్‌లో క్షేత్ర స్థాయి యంత్రాంగం, క్యాడర్ సమన్వయం, రాజకీయ స్పందన, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా వ్యవహరించడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎండగట్టడం వంటి అంశాలపైనా కీలక చర్చలు జరగనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!