

గాయాల నుంచి కోలుకున్నారని ఆటగాళ్లను ఎంపిక చేసి, వారు ఒక మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకముందే మళ్లీ గాయపడటం ఇటీవల తరచుగా జరుగుతోంది. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ఎంపికైన నితీశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠినంగా వ్యవహరించనుందని సమాచారం. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించిన తర్వాతే వారిని మ్యాచ్‌లకు అందుబాటులోకి తీసుకురావాలని సీవోఈకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. మరోవైపు ఐపీఎల్‌లో గాయపడి ఆటకు దూరమైన హార్దిక్ పాండ్య ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాలేదు.
అఫ్గానిస్థాన్ సిరీస్ అనంతరం భారత్ ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. హార్దిక్ అప్పటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అక్టోబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. దీనికి ముందు భారత్-కివీస్ ఏ జట్ల మధ్య మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లను రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోనున్నారు. అనంతరం అక్టోబర్ 22 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులతో భారత జట్టు షెడ్యూల్ బిజీగా ఉండనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!