

మిత్రుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి రోడ్ల నిర్మాణం నుంచి పచ్చదనం పెంపు వరకు ఆయన చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని చంద్రబాబు అభినందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!